బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్

బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల


 డిచ్ పల్లి, మార్చ్ 16 ( ఇందూర్ నేత్రం):

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం  నాక తండా కు చెందిన భూక్య సంతు నాటు సారా తయారు చేస్తూ బైండోవర్ ఉల్లంఘనలో డిచ్ పల్లి తహసీల్దార్  జైలుకు పంపబడగా 2,00,000 రూపాయలు కట్టడంతో  జైలు నుండి విడుదల చేయడం జరిగింది. డిచ్ పల్లి గ్రామంలో నాటు సారాయి తయారీకి వినియోగించే బెల్లం, పటిక లను విక్రయిస్తూ పలుమార్లు అరెస్ట్ కాబడి బైండోవర్ ఉల్లంఘించడంతో 2,00,000 రూపాయలు కట్టాలని   డిచ్ పల్లి తహసీల్దార్  నోటీస్ తీసుకున్న రేఖ అశోక్ అనే వర్తకుడు  2,00,000 రూపాయలను కట్టడం జరిగింది. ఎవరూ నాటు సారాయి తయారుచేసినా, విక్రయించినా, వాటి తయారీకి వినియోగించే పదార్థాలను అమ్మిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, బైండోవర్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్  పేర్కొన్నారు.

  నడిపల్లి తండా, డిచ్ పల్లి గ్రామంలో ఎక్సైజ్ శాఖ దాడులు నిర్వహించగా నాటు సారాయి తయారు చేస్తున్న  ముదావత్ బలిరామ్, బదావత్ రజిత 6 లీటర్ల నాటు సారాయి తో పట్టుపడగా వారిపై కేసులు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్  పేర్కొన్నారు. దీనిలో ఎక్సైజ్ ఎస్సై ప్రమోద్ చైతన్య, కానిస్టేబుళ్లు ధర్మేందర్, మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.