హక్కులు, చట్టాలపై అవగాహన ఉండాలి. --జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి

 హక్కులు, చట్టాలపై అవగాహన ఉండాలి.

--జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి,మార్చ్8 ( ఇందూర్ నేత్రం ):



జిల్లాలో మహిళా సంక్షేమానికి, అభ్యున్నతికి  అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా కలెక్టర్   టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట స్థానిక రవి కన్వెన్షన్ హాల్ లో ఐసీడీయస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2022 వేడుకలలో జెడ్.పి. సి.ఈ. ఓ సురేష్ తో కలసి  ఆయన పాల్గొన్నారు.

 ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడతూ నిరంతర శ్రామికరాలు స్త్రీయని, మహిళలకు హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మహిళ సాధికారతే లక్షంగా మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.   ప్రభుత్వం మహిళ అభ్యున్నతి, సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల కొరకు రూపొందించి  అందిస్తున్న పలు పథకాలను జిల్లాలోని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని అన్నారు.  జిల్లాలో  కల్యాణ లక్ష్మీ, శాదీముబారక్, కేసీఆర్ కిట్, వంటరీ మహిళ , వృధ్యాప్య పించంన్లు అలాగే మరెన్నో అద్భుత పథకాలు అందిస్తున్నామని అన్నారు. బాల్య వివాహాలు, బృన హత్యలు   జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  జిల్లా అంతటా షీ టీమ్స్  ద్వారా  మహిళ రక్షణ కోరకు నిరంతర నిఘా పెట్టమని , జిల్లాలో ఎక్కడకూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం పోలీస్, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపడుతున్నని అన్నారు. మహిళ బాధితులకు అండగా ఉంటూ వారి ఆర్ధిక బలోపేతానికి చేయుత అందిస్తున్నామని అన్నారు. మహిళలలో అసమానతలు దూరం చేస్తూ సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. దేశ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు ఉన్నతమైన స్థానాలలో విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. జిల్లాలో విద్య, వైద్య రంగాలలో అన్ని మౌళిక వసతులు కల్పించి అన్ని రకాల సేవలు అందిస్తున్నామని అన్నారు.  స్వయం సహాయక బృందాలు రుణాలు తీసుకొని తిరిగి చెల్లింపులో జిల్లాలో ముందంజలో ఉడడం వారి పనితీరు అభినందించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో మహిళలకు   మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు,బాలికలు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం మహిళ అధికారులు, అంగన్వాడీ సిబ్బందిని మెమోంటోలు, ప్రశంశ పాత్రలు అందచేసి సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా బాల భవన్,అంగన్వాడీ కార్యకర్తలు, tss కళా బృందాల చే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.

Popular posts
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image